Share News

Jammu and Kashmir: కశ్మీరీయేతరులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ఇద్దరు మృతి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:12 PM

గందర్‌బలోని సోనామార్గ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పౌరులపై దాడులకు తెగబడ్డారు. ఉగ్రమూకల దాడిలో ఇద్దరు కశ్మీరీయేతరులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జిల్లాలోని గుండ్ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణంలో...

Jammu and Kashmir: కశ్మీరీయేతరులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ఇద్దరు మృతి..
Jammu and Kashmir

జమ్మూ కశ్మీర్‌, అక్టోబర్ 20: గందర్‌బలోని సోనామార్గ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పౌరులపై దాడులకు తెగబడ్డారు. ఉగ్రమూకల దాడిలో ఇద్దరు కశ్మీరీయేతరులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జిల్లాలోని గుండ్ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణంలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంపు వద్ద ఉన్న కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలిపారు. ఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ఆ ప్రాంతాన్ని ముట్టడించాయి. భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నాయి.


జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. పౌరులే లక్ష్యంగా దాడులు చేసి హతమార్చిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం షోపియాన్‌లో ఉగ్రవాదులు ఇలాంటి దాడికే తెగబడ్డారు. అక్కడ కాశ్మీరీయేతర యువకుడిని కాల్చి చంపారు. గందర్‌బల్‌లోనూ ఇద్దరు కాశ్మీరీయేతర కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే.. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.


ఉగ్రవాదుల కోసం వేట..

కశ్మీరీయేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడులను భద్రతా బలగాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఘటన జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా.. డేగకన్నుతో వేట సాగిస్తున్నారు. ఉగ్రమూకలను ఏరివేసేందుకు పకడ్బందీగా ముందుకు కదులుతున్నారు. ఇందుకోసం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి..

ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా అభివర్నించారు. నిరాయుధ, అమాయక ప్రజలపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. విపక్ష పార్టీలు సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

ముంచుకొస్తున్న మరో తుపాను.. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు

బద్వేల్ ఘటనపై వివరాలు వెల్లడించిన కడప ఎస్పీ

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

For More National News and Telugu News..

Updated Date - Oct 20 , 2024 | 10:12 PM