Share News

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి

ABN , Publish Date - May 07 , 2024 | 07:35 PM

బెంగాల్ ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల రద్దుపై కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి

న్యూఢిల్లీ, మే 07: బెంగాల్ ప్రభుత్వం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల రద్దుపై కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అభ్యర్థులపై కానీ.. ప్రభుత్వ ఉన్నతాధికారులపైన కానీ బలవంతంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

LokSabha Elections: అధికారం కోసం మోదీ అండ్ కో ఎంతకైనా..

ఈ నియామకాలు వ్యవస్థగత మోసమని అభివర్ణించింది. మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్, జేబీ పర్దీవాలా‌తోపాటు మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ అంశంపై సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. సత్యం గెలిచిందన్నారు.


AP Assembly Elections: జగన్‌ను గద్దె నెక్కించేందుకు.. రంగంలోకి కేసీఆర్ అండ్ కో

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బెంగాల్ ప్రతిష్టను మసక బార్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు నిర్వీర్యం చేసిందన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ప్రజలతో కలిసి భుజం భుజం కలిపి పోరాడతామని అభిషేక్ బెనర్జీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

Putin Record: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం

రాష్ట్రంలో నిర్వహించిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో కుంభకోణం చోటు చేసుకుందని కొల్‌కత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఆందుకు సంబంధించిన నియామకాలన్నీ రద్దు చేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని సూచించింది.


ఈ విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి నివేదికను అందజేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇక జీతాలు తీసుకున్న వీరంతా.. 12 శాతం వడ్డితో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొంది. కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం మండిపడింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు

2016లో రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాల్లో బోధన, బోధనేతర ఉపాధ్యాయుల కోసం పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. దాదాపు 24 వేల ఈ ఉద్యోగాల కోసం .. 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ.. పలువురు అభ్యర్థులు కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు.. ఉద్యోగ నియామకాలను మొత్తం రద్దు చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 07:37 PM