Share News

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..

ABN , Publish Date - Feb 23 , 2024 | 07:59 AM

Subsidy on Potash: ఓవైపు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు(Farmers) పోరాటం సాగిస్తుండగా.. మరోవైపు రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం(Union Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది.

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
Subsidy on Potash

Subsidy on Potash: ఓవైపు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు(Farmers) పోరాటం సాగిస్తుండగా.. మరోవైపు రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం(Union Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది. పీడీఎం(పొటాష్ డెరైవ్డ్ ఫ్రమ్ మొలాసిస్) (PDM) ధరలను ప్రస్తుత ఏడాదికి టన్నుకు రూ. 4,263 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు సంబంధించి చక్కెర కర్మాగారాలు, ఎరువుల కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది.

ఎరువుల కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీ..

పీడీఎం తయారీ కంపెనీలు, యూనిట్లకు ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. తయారీదారులు ఎరువుల శాఖకు సంబంధించి 'న్యూట్రియంట్స్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్' (ఎన్‌బిఎస్) కింద టన్నుకు రూ.345 సబ్సిడీని క్లెయిమ్ చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎరువుల ప్రస్తుత ధరకే తయారీదారులకు ఈ సబ్సిడీ లభిస్తుంది. దీంతో.. ఎరువుల కంపెనీలు, యూనిట్లు ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని తుది వినియోగదారైన రైతులకు అందిస్తే.. రైతులకు తక్కువ ధరకే ఎరువులు లభించే అవకాశం ఉంది.

పీడీఎం(PDM).. మొలాసిస్ ఆధారిత ఫర్నేస్‌లలోని బూడిద నుంచి వస్తుంది. ఇది చక్కెర ఆధారిత ఇథనాల్ పరిశ్రమ నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఈ ఫర్నేస్‌లు ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేటప్పుడు స్పెండ్ వాష్ అనే పనికిరాని వ్యర్థ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని బూడిదగా మార్చడానికి జీరో లిక్విడ్ డిశ్చార్జ్(ZLD) బాయిలర్‌(IB)లో కాలుస్తారు. పొటాష్ అధికంగా ఉండే ఈ బూడిద నుంచి 14.5 శాతం పొటాష్ కలిగిన పీడీఎంని ఉత్పత్తి చేయొచ్చు. రైతులు తమ పొలాల్లో MOP(60శాతం పొటాష్ కంటెంట్ ఉన్న మ్యూరేట్ ఆఫ్ పొటాష్)కి ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించొచ్చు.

కాగా, ప్రస్తుతం దేశంలో పొటాష్‌ను ఎరువుగా పూర్తిగా ఎంఓపీ రూపంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు పీడీఎం ఉత్పత్తి, వినియోగం వలన ఎంవోపీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో పీడీఎం ఉత్పత్తిలో దేశం స్వావలంబనగా మారుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 07:59 AM