Share News

Monsoon: నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. మే 31 నాటికి..

ABN , Publish Date - May 19 , 2024 | 03:21 PM

ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

 Monsoon: నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. మే 31 నాటికి..
Southwest Monsoon hit Nicobar Islands

ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లా నిని కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు(andaman and nicobar) చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.


దీంతో మే 31 నాటికి రుతుపవనాలు కేరళ(kerala)కు చేరుకునే అవకాశం ఉందన్నారు. గత 150 ఏళ్లలో కేరళలో రుతుపవనాల ఆగమన తేదీల్లో చాలా తేడాలు ఉన్నాయి. 1918 సంవత్సరంలో రుతుపవనాలు మొదటగా మే 11వ తేదీన వచ్చాయి. అయితే 1972లో రుతుపవనాలు జూన్ 18న కేరళకు వచ్చినప్పుడు తొలి ఆగమనం జరిగింది. గతేడాది జూన్ 8న రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. 2022లో రుతుపవనాలు మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళకు చేరుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనది కాబట్టి రుతుపవనాల ఆధారంగా దేశంలో పంటలు పండిస్తారు.


ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే దక్షిణ భారతదేశంలో వేడిగాలులు మొదలయ్యాయి. విపరీతమైన వేడి కారణంగా పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగి నీటి వనరులు కూడా ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో రుతుపవనాల ముందస్తు ఆగమనం గొప్ప ఉపశమనమని చెప్పవచ్చు. భారతదేశ(india) వ్యవసాయంలో 52 శాతం వర్షంపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఖరీఫ్ పంటకు జూన్, జూలైలో రుతుపవనాల వర్షాలు కూడా చాలా అవసరం.


ఇది కూడా చదవండి:

Shocking: వారు అమ్మేది చెప్పులే.. కానీ, ఆ గది నిండా నోట్ల కట్టలే..!


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 03:24 PM