Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Mumbai: చైనా టు పాక్.. వయా ముంబై.. అదుపులో ఓడ.. తనిఖీ చేసిన అధికారులు షాక్

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:53 PM

పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరకు ఉందన్న అనుమానంతో చైనా(China) నుంచి కరాచీకి వెళ్తున్న ఓడను ముంబై(Mumbai)లోని న్హవా షెవా పోర్ట్‌లో భారత భద్రతా సంస్థలు శనివారం నిలిపేశారు. కస్టమ్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 23న కరాచీ నుంచి ఆ ఓడ బయల్దేరింది.

Mumbai: చైనా టు పాక్.. వయా ముంబై.. అదుపులో ఓడ.. తనిఖీ చేసిన అధికారులు షాక్

ముంబై: పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరకు ఉందన్న అనుమానంతో చైనా(China) నుంచి కరాచీకి వెళ్తున్న ఓడను ముంబై(Mumbai)లోని న్హవా షెవా పోర్ట్‌లో భారత భద్రతా సంస్థలు శనివారం నిలిపేశారు. కస్టమ్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 23న కరాచీ నుంచి ఆ ఓడ బయల్దేరింది. తాజాగా అది ముంబై ఓడరేవుకు వచ్చింది.

అధికారులకు అనుమానం వచ్చి ఓడను తనిఖీ చేశారు. అందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (CNC) యంత్రానికి సంబంధించిన సరకు ఉండటాన్ని గుర్తించారు. సీఎన్సీ యంత్రాలను కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తారు. పాక్‌కి సరఫరా అవుతున్న సరకు దాయాది దేశం అణు కార్యక్రమాల కోసం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.


పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి కీలకమైన భాగాలను తయారు చేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. సీఎన్సీ మిషన్‌ని ఉత్తర కొరియా అణు కార్యక్రమాల్లో వినియోగిస్తోంది. అధికారులు పకడ్బందీ నిఘాతో, భారీ కార్గోను తనిఖీ చేసి దాయాది కుట్రలపై భారత రక్షణ అధికారులను అప్రమత్తం చేశారు.

ఆ తరువాత సరకు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్, చైనా రెండూ అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ అణు ఒప్పందాలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగించడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 04:54 PM