Share News

Viral Video: విమానంలో పనిచేయని ఏసీ.. చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత!

ABN , Publish Date - Feb 24 , 2024 | 12:34 PM

ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్‌కు బయలుదేరాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. అందులోని ఏసీ పనిచేయకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు.

Viral Video: విమానంలో పనిచేయని ఏసీ.. చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత!

ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్‌కు(Mumbai to Mauritius) బయలుదేరాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. అయితే ఆ విమానంలో మెకానికల్ లోపం కారణంగా ఎయిర్ కండీషనర్లు పనిచేయలేదు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ప్రయాణికుల్లో 78 ఏళ్ల వృద్ధుడితోపాటు పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం ముంబై నుంచి మారిషస్‌కు బయలుదేరాల్సిన ఎయిర్ మారిషస్ విమానం (MK749)లో చోటుచేసుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AAP-Congress: ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు ఫైనల్


అయితే ఎయిర్ మారిషస్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ MK749 విమానం(Flight) ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్‌కు ఉదయం 4:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ తెల్లవారుజామున 3:45 గంటలకే ప్రయాణికులను విమానం ఎక్కించారు. ఆ క్రమంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటి ముందు ఇంజన్‌లో సమస్యలు తలెత్తాయి. ఆ క్రమంలో దాదాపు 5 గంటలకు పైగా ప్రయాణికులు విమానంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ క్రమంలో విమానంలో సమస్య ఉందని సిబ్బంది దిగేందుకు కూడా అనుమతించలేదని పలువురు ప్రయాణీకులు(passengers) వాపోయారు. ఐదు గంటల తర్వాత విమానంలోని ప్రయాణికులంతా ఆరోగ్యంగా ఉన్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. మారిషస్ వెళ్లేందుకు సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసిందని ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు చెప్పారు.

Updated Date - Feb 24 , 2024 | 01:52 PM