Share News

Joe Biden: శ్వేత సౌధంలో ఒకవైపు ‘సారే జహాసే అచ్ఛా’.. మరోవైపు పానీపూరి..

ABN , Publish Date - May 15 , 2024 | 12:21 PM

అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.

Joe Biden: శ్వేత సౌధంలో ఒకవైపు ‘సారే జహాసే అచ్ఛా’.. మరోవైపు పానీపూరి..

అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు. భారత దేశ అత్యుత్తమ రుచులను సైతం శ్వేతసౌధంలో అతిథులకు వడ్డించడం విశేషం.

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ


ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ.. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ మంత్ వేడుకలకుక తాను హాజరయ్యానని.. అక్కడ ‘సారే జహాసే అచ్చా’తో స్వాగతం లభించడం చాలా సంతోషంగా అనిపించిదన్నారు. నిజానికి ఇది గర్వించదగిన తరుణమన్నారు. తాను కూడా వారితో కలిసి పాడానని.. మరోసారి ప్లే చేయమని కోరానని అజయ్ తెలిపారు. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ మంత్‌లో ఈ పాటను ప్లే చేయడం ద్వారా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన బృందం భారత్-అమెరికా సంబంధాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోందన్నారు. వైట్ హౌస్‌లో భారత దేశభక్తి గీతాన్ని ప్లే చేయడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని ప్లే చేశారు.

రాజస్థాన్ ప్రసంగంలో మోదీ చేసిన వ్యాఖ్యలేంటి?

Read Latest National News and Telugu News

Updated Date - May 15 , 2024 | 12:21 PM