Share News

జమ్ము కశ్మీర్‌కు రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:35 PM

మార్చి30: జమ్ము కశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో 27 మంది స్టార్ కాంపేయనర్లు పాల్గొన్నారు.

జమ్ము కశ్మీర్‌కు రేవంత్ రెడ్డి

శ్రీనగర్, మార్చి30: జమ్ము కశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల (jammu and kashmir lok sabha elections) ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revant reddy) పాల్గొనున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో 27 మంది స్టార్ కాంపేయనర్లు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్.. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి శనివారం అందజేశారు. ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇక కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్‌లో 5 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ఉదంపూర్‌లో.. ఏప్రిల్ 26న జమ్ములో.., మే 7న అనంతనాగ్, రాజోరీల్లో.., మే 13న శ్రీనగర్‌లో.., మే 20న బారాముల్లాలో జరగనున్నాయి. ఇక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. అయితే జమ్ము కాశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతోన్న తొలి లోక్ సభ ఎన్నికలు. అయితే జమ్ము కశ్మీర్ ఓటర్ల నాడి ఎలా ఉందన్నది ఈ ఎన్నికల ఫలితాల సరళి బట్టి అర్థమవుతోందని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సైతం సాగుతోంది.

మరిన్నీ జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీ మృతిపై పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చేసింది..

Lok Sabha Elections: రాజ్‌నాథ్ అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టో కమిటీ



Updated Date - Mar 30 , 2024 | 04:53 PM