Share News

Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీ మృతిపై పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చేసింది..

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:48 PM

ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతోనే మరణించినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ధ్రువీకరించింది. జైలులో స్లో-పాయిజన్ కారణంగానే అన్సారీ మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది.

Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీ మృతిపై పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చేసింది..

లక్నో: ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) జైలులో గుండెపోటుతోనే (Cardiac arrest) మరణించినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ధ్రువీకరించింది. జైలులో స్లో-పాయిజన్ కారణంగానే అన్సారీ మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. 60కి పైగా కేసుల్లో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే అన్సారీ గురువారం రాత్రి జైలులోనే హఠాన్మరణం చెందారు. జిల్లా జైలు నుంచి హుటాహుటిన బాంద్రాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన మరణంపై ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానల్ శవపరీక్ష జరిపింది.


''గుండెపోటు కారణంతోనే ముఖ్తార్ అన్సారీ మరణించారని నిర్ధారణైంది'' అని పోస్ట్‌మార్టం నివేదక స్పష్టం చేసింది. అన్సారీ చిన్న కుమారుడు ఉమర్ అన్సారీ సమక్షంలోనే రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్గం నిర్వహించామని తెలిపింది. పోస్ట్‌మార్గం అనంతరం ముఖ్తార్ అన్సారీ మృతదేహాన్ని ఆయన సొంత గ్రామమైన ఘజియాపూర్‌కు భారీ పోలీసు బందోబస్తుతో తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉత్తరప్రదేశ్ అంతటా 144 సెక్షన్ నిషేధాజ్ఞలు విధించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌ బృందాలను కూడా రంగంలోకి దింపారు. అన్సారీ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్సారీ అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 03:48 PM