Share News

Lok Sabha Elections: రాజ్‌నాథ్ అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:51 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలలో ముందున్న భారతీయ జనతా పార్టీ కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని శనివారంనాడు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Lok Sabha Elections: రాజ్‌నాథ్ అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టో కమిటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elecitons) పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలలో ముందున్న భారతీయ జనతా పార్టీ కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ (Manifesto Committee)ని శనివారంనాడు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన 27 మందితో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా పీయూష్ గోయెల్‌ను నియమించారు.


కమిటీ ఇతర సభ్యులుగా ఇటీవలే ఎన్నికైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్‌ మేఘ్వాల్, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, రాజీవ్ చంద్రశేఖర్, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. ఏడుదశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1వ తేదీతో ముగియనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 04:54 PM