Share News

Rahul Gandhi: రైతు, యువత గోడు పట్టించుకోని మోదీ..

ABN , Publish Date - Apr 12 , 2024 | 06:41 AM

దేశంలో రైతులు, యువత, మహిళల గోడు పట్టించుకునే వారే లేరని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రైతులు కనీస మద్దతు ధర కోసం డిమాండ్‌ చేస్తున్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, మహిళలు ధరా ఘాతాన్ని భరించలేకపోతున్నారని అయితే, వీరెవరి గోడునూ పట్టించుకునే వారే లేరని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో...

Rahul Gandhi: రైతు, యువత గోడు పట్టించుకోని మోదీ..
Rahul Gandhi

  • ప్రజా సమస్యలు వదిలేసి మోదీని కీర్తిస్తున్న మీడియా

  • అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ: రాహుల్‌

జైపూర్‌, ఏప్రిల్‌ 12: దేశంలో రైతులు, యువత, మహిళల గోడు పట్టించుకునే వారే లేరని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రైతులు కనీస మద్దతు ధర కోసం డిమాండ్‌ చేస్తున్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, మహిళలు ధరా ఘాతాన్ని భరించలేకపోతున్నారని అయితే, వీరెవరి గోడునూ పట్టించుకునే వారే లేరని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణే ప్రస్తుత ఎన్నికల ప్రధాన అజెండా అని అన్నారు. 15–20 మంది నియంత్రణలో ఉన్న మీడియా 24 గంటలూ మోదీని కీర్తించడమే పనిగా పెట్టుకుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చేయబోయే మొదటి పని కుల గణన చేపట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. రైతు రుణాల మాఫీని పట్టించుకోని మోదీ... బిలియనీర్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి అగ్నిపథ్‌ అక్కర్లేదని తమ ప్రభుత్వం దానిని రద్దు చేస్తుందని తెలిపారు. ప్రస్తుత ఎన్నికలు దేశంలోని పేదప్రజలకు, 22–25మంది బిలియనీర్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 06:41 AM