Share News

Lok Sabha Elections 2024: రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్

ABN , Publish Date - May 03 , 2024 | 02:46 PM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.

Lok Sabha  Elections 2024: రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి (Rae Bareli) లోక్‌సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం రాయబరేలి నుంచి రాహుల్ అభ్యర్థిత్వాన్ని, అమేథి నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబం సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. రాయబరేలి నియోజకవర్గానికి సోనియాగాంధీ రెండు దశాబ్దాలుగా ప్రాతనిధ్యం వహించగా, అంతకు ముందు ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అమేథీ, రాయబరేలి నియోజకవర్గాలకు మే 20న జరిగే ఐదో విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగనుంది. కాగా, రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 02:49 PM