Share News

Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:12 PM

దేశంలో ఇకపై సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Modi Presents: తొలిసారిగా 'నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

దేశంలో ఇకపై సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఢిల్లీ(delhi)లోని భారత్ మండపం(Bharat Mandapam)లో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డుల(National Creators Award)ను అందించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మైథిలీ ఠాకూర్‌కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రధాని అందజేశారు. దీంతోపాటు జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డులను అందజేశారు.


అయితే సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ సహా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల(digital content creators)ను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుతం 20 విభాగాల్లో ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. ఈ అవార్డుల కోసం అప్లై చేసుకునే వ్యక్తులు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కల్గి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు భారతీయులై ఉండి, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించబడిన కంటెంట్‌ను కలిగి ఉండాలి. ఆ క్రమంలో కంటెంట్ సృష్టికర్తలు గరిష్టంగా మూడు కేటగిరీలలో స్వయంగా నామినేషన్ వేసుకోవచ్చు.


ఇక ది బెస్ట్ స్టోరీటెల్లర్ అవార్డ్ నుంచి ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ వరకు పలు విభాగాల్లో 200 మంది క్రియేటర్‌లు నామినేట్ అయ్యారు. నామినీలలో కత్రినా కైఫ్, కంగనా రనౌత్, రణవీర్ వంటి నటీనటులు ది ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ కేటగిరీ కింద గుర్తింపు పొందగా, సోషల్ మీడియా(social media) విభాగంలో కోమల్ పాండే, సిద్ధార్థ్ బాత్రా, కృతిక ఖురానా వంటి వారు ఉన్నారు. మొదటి రౌండ్‌లో 20 విభిన్న కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు రాగా ఓటింగ్ రౌండ్‌లో వివిధ విభాగాల్లో డిజిటల్ సృష్టికర్తలకు దాదాపు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తలతో సహా 23 మంది విజేతలను(winners) నిర్ణయించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Water Crisis: తీవ్ర నీటి సంక్షోభం.. ఈ పనులకు తాగు నీరు వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా

Updated Date - Mar 08 , 2024 | 12:15 PM