Share News

Ayodhya: రాముడే పుట్టాలి.. ఆ రోజే డెలివరీ చేయండి.. ఆస్పత్రులకు వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు..

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:21 PM

జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఆస్పత్రులకు గర్భిణీల నంచి....

Ayodhya: రాముడే పుట్టాలి.. ఆ రోజే డెలివరీ చేయండి.. ఆస్పత్రులకు వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు..

జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఆస్పత్రులకు గర్భిణీల నంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు డెలివరీ చేయాలని కోరుతున్నారు. అలా చేయడం ద్వారా పుట్టబోయే పిల్లలకు రాముడి లక్షణాలు కలుగుతాయని ఆశిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నార్మల్ డెలివరీలతో పోలిస్తే.. సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన కేసుల్లో మాత్రం ఈ తేదీనే ఎక్కువగా తల్లిదండ్రులు రిఫర్ చేస్తున్నారన్నారు. పెరిగిన డిమాండ్ మేరకు ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రసవ తేదీపై వారికి అవగాహన కలిగించినా.. ఎలాంటి మార్పూ రాలేదని జనవరి 22 తేదనే డెలివరీ చేయాలని పట్టుబడుతున్నారని, కాబట్టి తాము ఏమీ చేయలేకపోతున్నట్లు వైద్యులు వాపోయారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. గర్భిణీల ఆరోగ్యానికి వైద్యులు తగిన సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు.

జనవరి 22న ఆలయ ప్రతిష్ఠాపన జరిగే వరకు రామ్ లల్లా విగ్రహం రహస్యంగానే ఉంటుంది. గర్భగుడిలో ప్రతిష్టించే వరకు దర్శనానికి అనుమతించరు. మరోవైపు.. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన కార్డులు విడుదలయ్యాయి. ఎరుపు, బంగారు రంగులో ఉన్న కార్డులపై ఆలయ చిత్రం, పేరు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లోగో ఉన్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, గవర్నర్‌, ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ హాజరుకానున్నారు.


పవిత్రోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, యజ్ఞం, శోభాయాత్ర, భూమి పూజ ఉంటాయి. సోంపురా కుటుంబీకుల రూపకల్పన ఆధారంగా ఈ ఆలయంలో మూడు గోపురాలు, ఐదు ప్రవేశాలు, 360 స్తంభాలు, మ్యూజియం, లైబ్రరీ, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద, ఎత్తైన దేవాలయాలలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 03:21 PM