Share News

Obsecene tapes scandal: ప్రజ్వల్ తొలి రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - May 01 , 2024 | 07:26 PM

లోక్‌సభ ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన అభ్యంతకర వీడియోల స్కాండల్ పై హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుందని అన్నారు.

Obsecene tapes scandal: ప్రజ్వల్ తొలి రియాక్షన్ ఇదే..

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ సంచలనం సృష్టించిన అభ్యంతకర వీడియోల స్కాండల్ (Obscene tapes scandal)పై హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) తొలిసారి స్పందించారు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుందని అన్నారు. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను జేడీఎస్ సస్పెండ్ చేస్తూ, షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనికి ముందే రేవణ్ణ బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయారు.

Prajwal Revanna: ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్న ప్రజ్వల్


''విచారణకు హాజరయ్యేందుకు నేను బెంగళూరులో లేను. ఈ విషయాన్ని బెంగళూరు సీఐడీకి మా లాయర్ ద్వారా తెలియజేశాను. త్వరలో నిజం నిగ్గుతేలుతుంది'' అని ప్రజ్వల్ బుధవారంనాడు 'ఎక్స్' సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.


సిట్ దర్యాప్తు

ప్రజ్వల్‌పై వచ్చిన సెక్స్ స్కాండిల్ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడా ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీకే సింగ్ సారథ్యంలో ఈ సిట్ బృందం ఏర్పాటైంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 07:26 PM