Share News

Delhi: త్వరలో బీజేపీ కీలక సమావేశం.. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు!

ABN , Publish Date - Feb 29 , 2024 | 09:45 PM

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ(BJP) సమాయాత్తం అవుతోంది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు వీలుగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ(PM Modi) హాజరుకానున్నారు.

Delhi: త్వరలో బీజేపీ కీలక సమావేశం.. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు!

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ(BJP) సమాయాత్తం అవుతోంది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు వీలుగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ(PM Modi) హాజరుకానున్నారు. ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అభ్యర్థులను ప్రకటించాలని తద్వారా ఇండియా కూటమిపై ఒత్తిడి తేవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేంద్ర ఎన్నికల కమిటీలోని 550 మందికి పైగా సభ్యులు రూపొందించిన జాబితాపై చర్చించడానికి ప్రధాని మోదీ, పార్టీ ప్రధాన వ్యూహకర్త, హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah), కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సహా సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.


ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, తెలంగాణ, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ తదితర రాష్ట్రాల లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేశారు. మార్చి 10 లోపు 300 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని అనుకుంటున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా మోదీ ఇదే ప్రణాళిక రచించారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు అంటే మార్చి 21న బీజేపీ 164 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తే.. కాంగ్రెస్ పార్టీపై మానసిక ఒత్తిడి పెరిగి.. ఓటర్ల ముందు ఇండియా కూటమి బలహీనత బయటపడుతుందని బీజేపీ భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 09:50 PM