Lok Sabha Elections: ఆ ఇద్దరి ఫారెన్ ట్రిప్‌కు టిక్కెట్లు బుక్కయ్యాయి.. మోదీ పంచ్
ABN , Publish Date - May 17 , 2024 | 05:47 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం వరుస ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. తన ప్రసంగాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూటమిపై పంచ్‌లు గుప్పిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరూ విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుట్టు తనకు తెలిసిందని ఫతేపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని చెప్పారు.
ఫతేపూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం వరుస ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. తన ప్రసంగాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూటమిపై పంచ్‌లు గుప్పిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరూ విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుట్టు తనకు తెలిసిందని ఫతేపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని చెప్పారు.
Lok Sabha Elections: అమేథీ నుంచే వచ్చా, ఎప్పటికీ వారితో ఉంటా: రాహుల్ గాంధీ
''కాంగ్రెస్, సమాజ్‌వాదీ కలలు చెల్లాచెదురు కావడంతో 'బ్లేమ్ గేమ్' మొదలుకానుంది. జూన్ 4 తర్వాత ఏం చేయాలనే ప్లానింగ్‌లో వాళ్లు ఉన్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఇద్దరూ టక్కెట్లు బుక్ చేసుకున్నట్టు నాతో ఎవరో చెప్పారు'' అని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉనికే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో ఉందని, కాంగ్రెస్, ఎస్పీ రెండూ కుటుంబ పాలనకు, అవినీతికి అలవాటు పడిన పార్టీలని, ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నేరస్థులు, మాఫియాలను ప్రోత్సహించడం, టెర్రిరిస్టులపై సానుభూతి కనబరచడం సహా ఏమి చేయడానికైనా వెనుకాడవని మోదీ విమర్శలు గుప్పించారు.