Share News

Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:32 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్‌షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని అన్నారు.

Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు

బార్‌పేట: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi), హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్‌షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి దేశ అభివృద్ధికి పట్ల ఎలాంటి చిత్తశుద్ధ లేదని అన్నారు. అసోంలోని బార్‌పేటలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ, ప్రధాని మోదీ పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టి ధనవంతులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.


''వాళ్లు ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వేలు, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను అమ్మేస్తున్నారు. మోదీ, షా ఇద్దరూ అమ్మకందార్లు, మరి కొనుగోలుదారులు ఎవరు? అదానీ, అంబానీలు. ఇదీ దేశాభివృద్ధి. వాళ్లు దేశాన్ని అభివృద్ధి చేయడం లేదు. ప్రధాని దేశ సంపదను కొల్లగొడుతున్నారు. పేదల సొమ్ము కొల్లగొట్టి పెద్దోళ్లకు ఇస్తున్నారు. రూ.16 లక్షల కోట్ల మేరకు ధనికులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారు. కానీ పేదలకు, రైతులకు ఇచ్చిందేమీ లేదు'' అని ఖర్గే విమర్శించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ 'ఫేక్ వీడియో'.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు


నెహ్రూ, ఇందిరపై ప్రశంసలు

పండిట్ జవహర్ లాలా నెహ్రూ, ఇందిరాగాంధీలు దేశంలో హరిత విప్లవం, శ్వేత విప్లవం తీసుకువచ్చారు. హరిత విప్లవంతో భారతదేశానికి ఆహార భద్రత కల్పించారు, ఎగుమతులకు అవసరమైన మిగులు సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బీహార్‌లోని మోతిహారిలో హరిత విప్లవాన్ని అప్పట్లో ప్రారంభించారు'' అని ఖర్గే గుర్తు చేశారు. ఇందుకు భిన్నంగా బీజేపీ వాళ్లు పేదల కోసం పుట్టిన ఏకైక వ్యక్తి మోదీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని తప్పుపట్టారు. ఈరోజు దేశ ప్రజలకు అవసరమైన గోధుమలు, బియ్యం, ధాన్యాలు తగినంత పడించుకుంటున్నామంటే దానికి కాంగ్రెస్సే కారణమని, వారు తీసుకువచ్చిన గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ కారణమని చెప్పారు. కనీసం నీడిల్ కూడా తయారుకాని దేశంలో రాకెట్లు తయారు చేసేందుకు ధైర్యం చేసిన నేతలు నెహ్రూ, ఇందిరాగాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్‌ను చూసి భయం పట్టుకున్నందువల్లే నిరంతరం బురదచల్లడం పనిగా మోదీ పెట్టుకున్నారని విమర్శించారు. రాహుల్‌ను చూసి మోదీ భయపడుతున్నారని అన్నారు. బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతున్న మోదీ ఇక్కడకి(అసోం) రైలు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ రైల్వే లైన్‌ను పూర్తి చేస్తామని, బార్‌పేటలో ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేస్తామని, 2,500 మందికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 05:32 PM