Share News

LokSabha Elections: ఖాతాలు మూసి.. నగదు లాగేసుకుంటాయి

ABN , Publish Date - May 22 , 2024 | 05:27 PM

ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంక్ ఖాతాలు మూసి వేసి అందులోని నగదు లాగేసుకొంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్థిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

LokSabha Elections: ఖాతాలు మూసి.. నగదు లాగేసుకుంటాయి
Uttar Pradesh's Shravasti in PM Narendra Modi

లఖ్‌నవూ, మే 22: ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంక్ ఖాతాలు మూసి వేసి అందులోని నగదు లాగేసుకొంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్థిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రభుత్వ హయాంలో పేదవారి కోసం దాదాపు 50 కోట్లకు పైగా జనధన్ యోజన ఖాతాలను ప్రారంభించానని తెలిపారు.

ఆ ఖాతాలన్నీ ప్రతిపక్షాలు మూసి వేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశాయి. ప్రధానిగా తాను దేశంలో ప్రతీ గ్రామానికి విద్యుత్ సరఫరా తీసుకు వచ్చానన్నారు. అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మాత్రం ఆ యా గ్రామాలన్నీ విద్యుత్ కోతల ద్వారా చీకటిలోకి నెట్టేస్తాయని విమర్శించారు. ఇక ప్రతీ ఇంటికి తాను కుళాయి ద్వారా నీళ్లు అందించానని గుర్తు చేశారు.


అయితే ఇంటికి దూరంగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయ గల నైపుణ్యంలో ప్రతిపక్షాలు పేరు సంపాదించాయని చెప్పారు. ఇక 4 కోట్ల మంది పేద ప్రజలకు కోసం నిర్మించిన ఇళ్లు.. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ల ఓటు బ్యాంక్‌కు కట్టబెడతారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా.. దానికి విరుద్దంగా చేయడం ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యేకత అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తే.. ప్రస్తుతం జైల్లో ఉన్న తీవ్రవాదులందరని.. ప్రధానమంత్రి తన నివాసంలో బిర్యానీ తినేందుకు ఆహ్వానిస్తారన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై ప్రధాని మోదీ ఈ సందర్బంగా వ్యంగ్య బాణాలు సంధించారు.


Bangladesh: కోల్‌కతాలో ఎంపీ అదృశ్యం..!

వీరిద్దరు పాల్గొంటున్న బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చిన కొన్ని వీడియోలను తాను చూశానని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సభలకు హాజరయ్యేందుకు ఈ రెండు పార్టీలు ప్రజలకు నగదు పంచి పెడుతున్నాయని.. అందుకే వారంతా వస్తున్నారని మోదీ విమర్శించారు. ప్రజలకు నగదు ఇవ్వకుండా ర్యాలీలకు తీసుకు రావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు ప్రధాని మోదీ సూచించారు. అయితే వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. వారు మీ కోసం ఏం పని చేస్తారంటూ ప్రజలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 05:27 PM