Share News

Congress: రూ.3,500 కోట్ల పన్ను బకాయిలపై కాంగ్రెస్‌కు భారీ ఊరట

ABN , Publish Date - Apr 01 , 2024 | 06:03 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3,500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకూ తాము ఎలాంటి చర్చలు తీసుకోమని ఆదాయం పన్ను శాఖ సుప్రీంకోర్టుకు సోమవారంనాడు తెలియజేసింది.

Congress: రూ.3,500 కోట్ల పన్ను బకాయిలపై కాంగ్రెస్‌కు భారీ ఊరట

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3,500 కోట్ల పన్ను బకాయిల (Tax Demands) విషయంలో జూలై 24వ తేదీ వరకూ తాము ఎలాంటి చర్చలు తీసుకోమని ఆదాయం పన్ను శాఖ (Income Tax Department) సుప్రీంకోర్టు (Supreme Court)కు సోమవారంనాడు తెలిపింది. దీంతో తదుపరి విచారణను జూలై 24వ తేదీకి అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.


రూ.3.567 కోట్ల పన్ను బకాయిలపై ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీకి ఇటీవల నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, ఆదాయం పన్ను విభాగాన్ని ఉపయోగించుకుని లోక్‌సభ ఎన్నికల్లో తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతా మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ ఏ పార్టీకి ఆదాయం పన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలదని జస్టిస్ బీవీ నాగరత్న సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. టాక్స్ డిమాండ్‌ను నిలిపివేయాలనుకుంటున్నారా అని ధర్మాసనం అడిగినప్పుడు, అలాంటిదేమీలేదని, ఎన్నికలయ్యేంత వరకూ ఎలాంటి చర్యలు ఉండబోవని మాత్రమే తాము తెలియజేస్తు్న్నామని అన్నారు. కాంగ్రెస్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి తన వాదన వినిపిస్తూ, ఆస్తులను జప్తు చేయడం ద్వారా కేంద్రం రూ.135 కోట్లు వసూలు చేసిందని అన్నారు. తమది (కాంగ్రెస్) ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్ కాదని, కేవలం రాజకీయ పార్టీ అని వాదించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 06:03 PM