Share News

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:16 AM

బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

Bihar politics - Nitish Kumar: సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు

పాట్నా: బీహార్(Bihar) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా(Nitish Kumar Resign) చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో విపక్షాల ఇండియా కూటమికి ఆయన గుడ్‌బై చెప్పినట్లైంది.

జేడీయూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు రానున్నారు. కూటమి ఏర్పాటు అనంతరం ఇరు పార్టీలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించనున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:50 PM