ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి మొదట ప్రమాణం చేసేది ఎవరంటే..
ABN , First Publish Date - Jun 24 , 2024 | 09:51 AM
18వ లోక్‌సభ తొలిసమావేశాలు కాసేపట్లో ప్రారంభమవుతాయి. మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
Live News & Update
-
2024-06-24T10:28:52+05:30
తొలిరోజే ఎపీ ఎంపీలు..
ఏపీకి చెందిన ఎంపీలు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేస్తారు.
రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది
-
2024-06-24T10:23:38+05:30
ఎంపీల ప్రమాణ స్వీకారం ఇలా..
మొదట అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మొదటి రోజు 279 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు
మిగిలిన 264 మంది లోక్‌సభ ఎంపీలు రెండో రోజు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఒక ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు ఒక నిమిషం సమయం పడుతుంది.
-
2024-06-24T10:21:13+05:30
ప్రమాణ స్వీకారం ఇలా..
ప్రధాని మోదీ తర్వాత కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేబినెట్ మంత్రుల తర్వాత.. ఇండిపెండెంట్ బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ప్రమాణం చేస్తారు.
మంత్రుల ప్రమాణం పూర్తైన తర్వాత ఎంపీల ప్రమాణం రాష్ట్రాల వారీ అక్షర క్రమంలో ఉంటుంది.
-
2024-06-24T10:13:52+05:30
ప్రొటెం స్పీకర్ ప్రమాణం
ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మహతాబ్
భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు

-
2024-06-24T10:02:58+05:30
ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు..
ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌ను కలిసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రొటెం స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ రిజిజు
-
2024-06-24T09:57:13+05:30
తొలి వ్యక్తి మోదీ..
18వ లోక్‌సభలో మొదట ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు.
మోదీ తర్వాత కేంద్రమంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు ప్రమాణం చేస్తారు.
కేంద్ర మంత్రుల ప్రమాణం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేస్తారు.
-
2024-06-24T09:51:21+05:30
కాసేపట్లో లోక్‌సభ సమావేశాలు..
18వ లోక్‌సభ తొలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి
18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్