Share News

Atal Setu: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సముద్ర వంతెనపై ప్రయాణానికి అనుమతి.. కానీ..

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:37 PM

ముంబయి మహానగరంలో కొత్తగా ప్రారంభమైన అటల్ బ్రిడ్జ్ పై ప్రయాణించాలని ఎదురుచూస్తున్న వారికి నవీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్ పోర్ట్ గుడ్ న్యూస్ చెప్పింది.

Atal Setu: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సముద్ర వంతెనపై ప్రయాణానికి అనుమతి.. కానీ..

ముంబయి మహానగరంలో కొత్తగా ప్రారంభమైన అటల్ బ్రిడ్జ్ పై ప్రయాణించాలని ఎదురుచూస్తున్న వారికి నవీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్ పోర్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అటల్ సేతుపైకి బస్సులను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మార్గం భారతదేశంలోనే అతిపెద్దదైన సముద్రంపై నిర్మించిన వంతెన కావడం విశేషం. నేరుల్ నుంచి మంత్రాలయ మధ్య నాలుగు సర్వీసులను ప్రారంభించాలని ప్రతిపాదించింది. వీటితో పాటు రెండు ఎలక్ట్రానిక్ బస్సులు సైతం ప్రతిపాదికల్లో ఉన్నాయి. అధికారుల తాజా నిర్ణయంతో అటల్ సేతుపై ప్రయాణం చేయాలనుకుంటున్న వారి ఆశలు నెరవేరనున్నాయి.

ఈ వంతెనపై ప్రయాణం చేసేందుకు ఏసీ సర్వీస్ అయిన 115 నంబర్ బస్సును ప్రతిపాదించారు. ఈ బస్సు ఇప్పటికే ఖార్కోపర్ నుంచి మంత్రాలయకు నడుస్తోంది. కొత్త మార్గంపై ప్రయాణం చేసేందుకు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. నేరుల్ నుంచి మంత్రాలయ వరకు 52 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రయాణానికి రూ.90నే ఫాలో అవ్వాలని అధికారులు తెలిపారు. అయితే టోల్ ఛార్జీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


ముంబయిలో నిర్మించిన అటల్ సేతు వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన 6 లేన్ల సముద్ర లింక్. దీనిపై టోల్ ట్యాక్స్ రూ.500గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 22 కిలోమీటర్ల వంతెనపై వెళ్లాలంటే ప్రజలు రూ.250 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫోర్-వీలర్, మినీ బస్సుల గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అదే సమయంలో వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదని నియమాలు ఖరారు చేశారు.

ఈ వంతెన ముంబయి- నవీ ముంబయిని కలుపుతుంది. ఈ రెండింటి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. సముద్ర జీవులకు హాని కలగకుండా వంతెనను నిర్మించారు. మొత్తం పొడవు 22 కిలోమీటర్లు ఈ వంతెనను 16.5 కిలోమీటర్లు అరేబియా సముంద్రంపై, 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 05:37 PM