Share News

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:11 AM

ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..

- తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి నుంచి తూత్తుకుడి లోక్‌సభ స్థానంలో ఈసారి కూడా కనిమొళి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కోవిల్‌పట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీజేపీ(BJP) అధికారంలో లేని రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని, నిధిగా రూపాయి చెల్లిస్తే కేంద్రం తమిళనాడుకు 25 పైసలు మాత్రమే పంపిణీ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ తమిళ భాష అంటే తనకు ఎనలేని ప్రేమ అని, తమిళ సంస్కృతిని విదేశీ వేదికల్లో ప్రస్తావిస్తున్నానని చెబుతున్నారని, ఆయనకు చక్కని తమిళ భాష నేర్పించగలిగిన టీచర్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తామని కనిమొళి చమత్కరించారు.

ఇదికూడా చదవండి: Former Chief Minister: వెనక్కి నడిస్తే కాళ్లకు బలం.. అంటూ మాజీసీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు...

Updated Date - Apr 02 , 2024 | 11:11 AM