Share News

PM Modi: మా ప్రజల భద్రతే మాకు ముఖ్యం.. నవాజ్‌ షరీఫ్‌కు సందేశానికి మోదీ రిప్లై

ABN , Publish Date - Jun 10 , 2024 | 08:49 PM

వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన అభినందన సందేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి బదులిచ్చారు. భారతదేశం ఎప్పుడూ శాంతి, ప్రగతినే కోరుకుంటుందని, భారత ప్రజల భద్రత అనేది ఎప్పుడూ తమ ప్రాధాన్యతా క్రమంలో ముందుంటుందని స్పష్టం చేశారు.

PM Modi: మా ప్రజల భద్రతే మాకు ముఖ్యం.. నవాజ్‌ షరీఫ్‌కు సందేశానికి మోదీ రిప్లై

న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి భారతదేశ ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif), మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) పంపిన అభినందన సందేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తిరిగి బదులిచ్చారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో భారత్ వైఖరిని మరోసారి విస్పష్టంగా తెలియజేశారు. భారతదేశం ఎప్పుడూ శాంతి, ప్రగతినే కోరుకుంటుందని, భారత ప్రజల భద్రత అనేది ఎప్పుడూ తమ ప్రాధాన్యతా క్రమంలో ముందుంటుందని స్పష్టం చేశారు.

Nawaz congrats PM Modi: ద్వేషాన్ని ఆశతో భర్తీ చేద్దాం.. మోదీకి నవాజ్ షరీఫ్ అభినందన సందేశం


బెట్టుచేసి.. దిగొచ్చిన పాక్

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను దాటటంతో పలు ప్రపంచ దేశాలు మోదీకి అభినందనలు తెలిపాయి. అయితే పాక్ మాత్రం ఇందుకు దూరంగా ఉండిపోయింది. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనందున ముందస్తుగా అభినందనలు తెలియజేయలేమంటూ గతవారం పాక్ సాకులు వెతికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పాక్ మినహా ఇరుగుపొరుగు దేశాలకు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పిలుపులు వెళ్లాయి. ఆదివారంనాడు మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడంతో చైనాలో పర్యటన ముగించుకున్న షెహబాజ్ ఎట్టకేలకు మోదీకి అభినందన సందేశం పంపారు. ఆ వెనువెంటనే నవాజ్ షరీఫ్ కూడా అభినందన సందేశం పంపుతూ, మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారనడానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రశంసించారు. ఇదే సమయంలో విద్వేషం స్థానంలో ఆశావహ దృక్పథం నెలకొంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు నరేంద్ర మోదీ దీటుగా స్పందించారు. భారత్ ఎప్పుడూ శాంతి, అభ్యుదయాన్నే కోరుకుంటుందని, భారత ప్రజల భద్రత అనేది ఎప్పటికీ తమ ప్రాధాన్యతాక్రమాల్లో ఒకటిగా ఉంటుందని విస్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 08:49 PM