Share News

PM Modi: బాధ్యతలు స్వీకరించిన మోదీ.. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని..

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:05 PM

దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించారు.

PM Modi: బాధ్యతలు స్వీకరించిన మోదీ.. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని..
PM Modi

దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తన కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయింపుపై కేబినెట్ కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మోదీ 3.0లో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తికానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసినవాళ్లుండగా.. 35 మంది కొత్తవాళ్లున్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 120 రోజుల కార్యాచరణ ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించనున్నారు.

Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్


తొలి సంతకం..

ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం దేనిపై పెడతారనే ఆసక్తి నెలకొంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కిసాన్ సమ్మాన్ నిధిపై మోదీ తొలి సంతకం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై ప్రధాని మోదీ సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.20 వేల కోట్లును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ఫైలుపై సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.


VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 12:06 PM