Share News

Modi Mujra remarks row: మోదీ 'ముజ్రా' వ్యాఖ్యలు.. పీఎం కోలుకోవాలంటూ విపక్షం కౌంటర్

ABN , Publish Date - May 25 , 2024 | 05:20 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో విపక్షలపై నిప్పులు చెరుగుతున్నారు. బీహార్‌లోని పాటలిపుత్రలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో 'ఇండియా' కూటమి ముస్లిం ఓట్ బ్యాంకు కోసం బానిసత్వం చేస్తోందని, 'ముజ్రా' డాన్స్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. కాగా, పీఎం 'ముజ్రా' వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఘాటుగా స్పందించారు.

Modi Mujra remarks row: మోదీ 'ముజ్రా' వ్యాఖ్యలు.. పీఎం కోలుకోవాలంటూ విపక్షం కౌంటర్

బీహార్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. బీహార్‌లోని పాటలిపుత్రలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ముస్లిం ఓట్ బ్యాంకు కోసం బానిసత్వం చేస్తోందని, 'ముజ్రా' (Mujra) ఆడుతోందని వ్యాఖ్యానించారు. కాగా, పీఎం 'ముజ్రా' వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఘాటుగా స్పందించారు. పీఎం మానసిక పరిస్థితికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయని, చికిత్సతో త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొంది.


మోదీ ఏమన్నారు?

ఇండియా కూటమిలోని పలు ప్రధాన పార్టీలను ప్రధాని మోదీ శనివారంనాడు టార్గెట్ చేస్తూ, ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తోందని ఆరోపించారు. "ముజ్రా'' డాన్స్ ఆడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. సామాజిక న్యాయం కోసం దిశానిర్దేశం చేసిన భూమి బీహార్‌ అని, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ హక్కులను దోచుకోవడానికి, వాటిని ముస్లింలకు మళ్లించడానికి ఇండియ కూటమి ప్లాన్ చేస్తోందన్నారు.

Arvind Kejriwal: పాక్ మంత్రికి క్లాస్ పీకిన కేజ్రీవాల్


చికిత్స తీసుకోండి..

ప్రధానమంత్రి చేసిన 'ముజ్రా' (మొఘల్‌ల కాలంలోని నృత్యరీతి) వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని నోటి వెంట 'ముజ్రా' మాట వచ్చినట్టు విన్నానని, ఆయన మానసిక స్థితిపై సందేహం కలుగుతోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేర వ్యాఖ్యానించారు. ''మోదీజీ...మీరు ఏదైనా చికిత్స తీసుకోండి. అమిత్‌షా, జేపీ నడ్డా అయినా ఆయనను తక్షణం చూపించాలి. బహుశా ఎండల కింద స్పీచ్‌లు ఇచ్చి మైండ్‌ మీద ఆ ప్రభావం పడినట్టు ఉంది'' అని ఖేర సూచించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ, నారీ శక్తితో మొదలు పెట్టి ఇప్పుడు 'ముజ్రా' వంటి వ్యాఖ్యల స్థాయికి మోదీ దిగిపోయారని ఆక్షేపించారు. పదేళ్ల పాటు ఎంత దాచుకోవాలనుకున్నా ఆయనలోని వ్యక్తి ఇప్పటికి బయటకు వచ్చారని, దిగజారుడు భాష మాట్లాడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. నిన్నమొన్నటి వరకూ 'మచిలీ, మటన్, మంగళసూత్ర' అంటూ వచ్చిన మోదీ ఇప్పుడు 'ముజ్రా' అంటున్నారని, ప్రధాని మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రశ్నించారు. శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది స్వయంగా మోదీ వీడియో క్లిప్‌ను జత చేస్తూ ''త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నాను మోదీజీ..'' అంటూ ట్వీట్ చేశారు.

Updated Date - May 25 , 2024 | 05:21 PM