Share News

మోదీ సీఎం కాబోతున్నారు: నితీశ్‌

ABN , Publish Date - May 27 , 2024 | 04:46 AM

మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నోరుజారారు.

మోదీ  సీఎం కాబోతున్నారు: నితీశ్‌

పట్నా, మే 26: మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నోరుజారారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎన్డీయే కూటమి పట్నాలో నిర్వహించిన ర్యాలీలో నితీశ్‌ మాట్లాడారు.

ఎన్డీయే ఈ సారి 400 సీట్లు గెలవబోతోందని, మోదీ మళ్లీ సీఎం కాబోతున్నారని, అప్పుడే దేశంతో పాటు బిహార్‌ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే వెంటనే తేరుకుని మోదీ ఇప్పటికే ప్రధాని అని ఆయన మరోసారి ఆ పదవిని అలంకరించబోతున్నారని స్పష్టం చేశారు. ఇటీవల పలు సందర్భాల్లోనూ నితీశ్‌ నోరుజారారు.

Updated Date - May 27 , 2024 | 04:46 AM