Share News

Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

ABN , Publish Date - Apr 09 , 2024 | 09:31 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు.

Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA ALLIANCE) ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. ధర్మపురంలో సోమవారం మధ్యాహ్నం డీఎంకే(DMK) అభ్యర్థి మణికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ పాలకులకు బానిసలుగా వ్యహరించిన అన్నాడీఎంకే నేతలంతా ఉన్నట్టుండి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లు కపట నాటకాలాడుతున్నారని, ఇప్పటికి వరకూ ఆ నేతలు బీజేపీ నాయకులనుగానీ, ప్రధాని మోదీని గాని విమర్శించలేదన్నారు. తమ కూటమి గెలిస్తే ప్రధాని అభ్యర్థి ఎవరో అన్నాడీఎంకే నాయకులు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: మోదీ ప్రసంగాల్లో ‘ఆర్‌ఎస్‌ఎస్‌ కంపు’

Updated Date - Apr 09 , 2024 | 09:39 AM