Share News

Iltija Mufti: దేశవ్యాప్తంగా మహిళా నేతలపై బీజేపీ స్నూపింగ్... మెహబూబా ముఫ్తీ కుమార్తె సంచలన ఆరోపణ

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:32 PM

వివాదాస్పద పెగాసెస్ స్నూపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఫోన్‌ను పెగాసెస్ స్పైవేర్ 'హ్యాక్' చేసిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె, మీడియా అడ్వయిజర్ ఇల్తిజా ముఫ్తి బుధవారంనాడు తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా నేతలపై అధికార బీజేపీ స్నూపింగ్‌కు పాల్పడుతోదంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సంచలన ఆరోపణలు చేశారు.

Iltija Mufti: దేశవ్యాప్తంగా మహిళా నేతలపై బీజేపీ స్నూపింగ్... మెహబూబా ముఫ్తీ కుమార్తె సంచలన ఆరోపణ

శ్రీనగర్: వివాదాస్పద పెగాసెస్ (Pagasus) స్నూపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఫోన్‌ను పెగాసెస్ స్పైవేర్ 'హ్యాక్' చేసిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె, మీడియా అడ్వయిజర్ ఇల్తిజా ముఫ్తి (Iltija Mufti) బుధవారంనాడు తెలిపారు. దేశవ్యా్ప్తంగా మహిళా నేతలపై అధికార భారతీయ జనతా పార్టీ (BJP) స్నూపింగ్‌కు పాల్పడుతోదంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సంచలన ఆరోపణలు చేశారు.

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు


''నా ఫోన్ పెగాసెస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్టు యాపిల్ అలెర్ట్ వచ్చింది. ఈ పెగాసిస్‌ను భారత ప్రభుత్వం సేకరించి, తమ విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులపై వినియోగిస్తోంది'' అని ఇల్తిజా ముఫ్తి ఆ పోస్ట్‌లో ఆరోపించారు. తన పోస్ట్‌ను ప్రధానమంత్రి కార్యాలయం, హోం మంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు. తన ఫోన్‌ను మెర్సెనరీ స్పైవేర్ టార్గెట్ చేసినట్టు రాసున్న ఐఫోన్ టెక్స్ట్ అలెర్ట్‌ స్కీన్‌షాట్‌ను కూడా ఆమె అప్‌లోడ్ చేశారు. కాగా, హైప్రొఫైల్ జర్నలిస్టులను టార్గెట్‌గా చేస్తూ పెగాసెస్ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం వాడుతోందంటూ గత ఏడాది అమెస్టీ ఇంజర్నేషనల్, ది వాషింగ్టన్ పోస్ట్ గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించాయి. అయితే 2021లో మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం 'అక్రమ నిఘా' ఆరోపణలను కొట్టివేసింది. అయితే, అమ్నెస్టీ రిలీజ్ చేసిన రిపోర్ట్‌పై మాత్రం న్యూఢిల్లీ స్పందించలేదు. ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ ఫర్మ్, ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ పెగాసెస్ స్పైవేర్‌ను డవలప్ చేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 08:32 PM