Share News

Metropolitan Magistrate: పరువు నష్టం దావాలో మేధా పాట్కర్‌ దోషి

ABN , Publish Date - May 25 , 2024 | 03:33 AM

పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేధా పాట్కర్‌ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ప్రకటించారు.

Metropolitan Magistrate: పరువు నష్టం దావాలో మేధా పాట్కర్‌ దోషి

న్యూఢిల్లీ, మే 24: పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేధా పాట్కర్‌ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ప్రకటించారు. ఆమెపై ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌-జీ)గా ఉన్న వి.కె.సక్సేనా గతంలో క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. ఆమెకు రెండేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, రెండూ గానీ విధించే అవకాశం ఉంది. పాట్కర్‌, సక్సేనాల మధ్య 2000 నుంచి న్యాయపోరాటం జరుగుతోంది.

Updated Date - May 25 , 2024 | 03:33 AM