Share News

Gujarat fire: గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం... 24 మంది మృతి

ABN , Publish Date - May 25 , 2024 | 08:33 PM

గుజరాత్‌ లోని రాజ్‌కోట్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగి 24 మంది చనిపోయారు. మృతులలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది.

Gujarat fire: గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం... 24 మంది మృతి
fire accident

రాజ్‌కోట్: గుజరాత్‌ (Gujarat)లోని రాజ్‌కోట్ సిటీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో శనివారం సాయంత్రం పెద్దఎత్తున మంటలు చెలరేగి 24 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదానికి కారణం వెంటనే తెలియలేదు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతుల సంఖ్య ఇతమిత్ధంగా చెప్పగలమని రాజ్‌కోట్ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ పటేల్ తెలిపారు.


సీఎం దిగ్భ్రాంతి

గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కొర్పేరేషన్, జిల్లా యంత్రాగానికి ఆదేశాలిచ్చినట్టు ట్వీట్‌లో తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ సహాయానికి ఆదేశాలిచ్చామని చెప్పారు.

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 11:08 PM