Share News

LokSabha Elections: ఏనుగు దాడి.. వృద్ధుడు మృతి

ABN , Publish Date - May 25 , 2024 | 08:17 PM

ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటు చేసుకుంది.

LokSabha Elections: ఏనుగు దాడి.. వృద్ధుడు మృతి

జంషెడ్‌పుర్, మే25: ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటు చేసుకుంది. తూర్పు సింగ్భమ్ జిల్లా గొబర్బనీ గ్రామ పెద్ద సురేంద్రనాథ్ హన్స్‌ద (71).. దొలబెడ పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేసేందుకు ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు.

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం


ఆ క్రమంలో అటవీ ప్రాంతంలో నుంచి ప్రయాణిస్తుండగా.. అతడిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. పోలింగ్ కేంద్రం కొద్ది దూరంలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిపై సమాచారం అందుకోగానే గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.

LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ


అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఘటశిల సర్దార్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సురేంద్రనాథ్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు అప్పగించారు. మరోవైపు మృతదేహానికి అంత్యక్రియలు కోసం అటవీ శాఖ రూ. 25 వేలు సురేంద్ర కుటుంబానికి ఆర్థిక సాయంగా అందించింది. జంషెడ్‌పుర్ లోక్‌సభ పరిధిలోని బహారగోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Latest News and National News here

Updated Date - May 25 , 2024 | 08:17 PM