Share News

LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ

ABN , Publish Date - May 25 , 2024 | 01:58 PM

ఈవీఎం మేషిన్లకు ఉన్న ట్యాగ్‌పై బీజేపీ ప్రతినిధి సంతకం మాత్రమే ఉండడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం స్పందించింది.

LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ

న్యూఢిల్లీ, మే 25: ఈవీఎం మేషిన్లకు ఉన్న ట్యాగ్‌పై బీజేపీ ప్రతినిధి సంతకం మాత్రమే ఉండడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం స్పందించింది. ఎన్నికల వేళ.. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల ప్రతినిధితోపాటు ఆ యా పార్టీల ఏజెంట్లు సీల్ చేసిన ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌లకు ఉన్న ట్యాగ్‌లపై సంతకం చేస్తారని ఈసీ వివరించింది.

అయితే టీఎంసీ పార్టీ ఆరోపణలు చేస్తున్న సదరు పోలింగ్ కేంద్రాల్లో.. పోలింగ్ ప్రారంభానికి ముందు బీజేపీ ప్రతినిధులు మాత్రమే వచ్చారని తెలిపింది. దీంతో ఈవీఎంలతోపాటు వీవీ ప్యాడ్‌లపై ఆ పార్టీ ఏజెంట్ సంతకం చేశారని పేర్కొంది.


అదీకాక ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌ల ట్యాగ్‌పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదంతా సీసీ టీవీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపింది. అలాగే వీడియో గ్రాఫర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో సైతం తీస్తారని ఎన్నికల సంఘం వివరించింది.

మే 25వ తేదీ దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు రెండు కేంద్రా పాలిత ప్రాంతాల్లోని .. 58 లోక్‌సభ స్థానాలకు ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్‌ బంకోరా జిల్లాలో రఘునాథ్‌పూర్‌లోని పొలింగ్ కేంద్రాల్లో 5 ఈవీఎం, వీవీ ప్యాడ్‌ల ట్యాగ్‌పై బీజేపీ వారి సంతకం ఉండడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించింది.


అంతేకాకుండా.. సదరు ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను ఫొటో తీసి.. వాటిని ఎక్స్ వేదికగా ఆ పార్టీ పోస్ట్ చేసింది. దానిపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి.. వివరణ ఇచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 25 , 2024 | 03:30 PM