Share News

Mamata Banerjee: ఇది బీజేపీ లూడో గేమ్.. సీఏఏ అమలుపై మమతా బెనర్జీ విమర్శలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:08 PM

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) అమలుపై ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్‌లో భాగమని తూర్పారపట్టారు.

Mamata Banerjee: ఇది బీజేపీ లూడో గేమ్.. సీఏఏ అమలుపై మమతా బెనర్జీ విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) అమలుపై ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్‌లో భాగమని తూర్పారపట్టారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు.


పౌరసత్వం పొందని వారి ఆస్తులు ఏమవుతాయని ప్రశ్నించిన మమతా బెనర్జీ.. ఇది బీజేపీ లూడో గేమ్ (Ludo Game) అంటూ దుయ్యబట్టారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్‌సీ)తో (National Register Of Citizen) సీఏఏ ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు తీసుకువెళతారని, బెంగాల్‌లో ఇది జరగడానికి తాను అనుమతించనని తెగేసి చెప్పారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా? అని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌ను విభజించేందుకు బీజేపీ సరికొత్త గేమ్ మొదలుపెట్టిందని తృణమూల్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, మనమంతా ఈ భారత పౌరులమేనని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు.

ఇదిలావుండగా.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై.. అక్కడి నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు గాను భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 2019లోనే ఈ చట్టం పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదాన్ని పొందినా.. ఇన్నేళ్ల తర్వాత అమల్లోకి వచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు ఆ మూడు దేశాల నుంచి భారత్‌లో అడుగుపెట్టిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు.. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 03:08 PM