Share News

Mamata Banerjee: బీజేపీకి మమతా బెనర్జీ సవాల్.. ఎన్నికల్లో 200 సీట్లు దాటితే..

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:18 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బీజేపీకి ఓ సవాల్ విసిరారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ.. కనీసం 200 స్థానాల్లో అయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు.. బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు.

Mamata Banerjee: బీజేపీకి మమతా బెనర్జీ సవాల్.. ఎన్నికల్లో 200 సీట్లు దాటితే..

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆదివారం బీజేపీకి (BJP) ఓ సవాల్ విసిరారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ.. కనీసం 200 స్థానాల్లో అయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు.. బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) అమలును తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు. CAA కోసం దరఖాస్తు చేసుకుంటే.. దరఖాస్తుదారులు విదేశీయులుగా మారుతారని, దాని కోసం దరఖాస్తు చేసుకోవద్దని ఆమె ప్రజల్ని హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) ఎంపీ మహువా మోయిత్రాకు (Mahua Moitra) మద్దతుగా.. కృష్ణానగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ అంటోంది. ముందుగా వాళ్లు 200 సీట్ల బెంచ్‌మార్క్‌ని దాటాలని నేను వారికి సవాల్ చేస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 200కి పైగా సీట్లు గెలుస్తామని వాళ్లు చెప్పుకున్నారు కానీ, 77 వద్ద ఆగిపోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు. ‘‘CAA అనేది ఒక ఉచ్చు. చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికే దీనిని తీసుకొచ్చారు. మేము పశ్చిమ బెంగాల్‌లో CAA లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (NRC) రెండింటినీ అనుమతించం’’ అని ఆమె ఉద్ఘాటించారు. ఇదే సమయంలో.. పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టం చేసిన ఆమె.. సీపీఐ(ఎం), కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో బీజేపీ కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. తమ ఎంపీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకే ఆమెను దూషించి, లోక్‌సభ నుంచి బహిష్కరించారని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.


మహువా మోయిత్రా కేసు

బీజేపీని, ప్రధాని మోదీని ఇరుకున పెట్టేలా గౌతమ్ అదానీపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు గాను మహువా మోయిత్రా నగదుతో పాటు బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనే.. ‘అనైతిక ప్రవర్తన’కు పాల్పడ్డారనే కారణంతో ఆమె గత డిసెంబర్‌లో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ కేసుకి సంబంధించి సీబీఐ ఆమె నివాసాలపై దాడులు కూడా జరిపింది. అటు.. ఫెమా ఉల్లంఘన కేసులో ఈడీ నుంచి సమన్లు సైతం జారీ అయ్యాయి. అయితే.. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, కేవలం అదానీ గ్రూప్‌ని ప్రశ్నించినందుకే తనని టార్గెట్ చేసుకున్నారని మోయిత్రా చెప్తున్నారు. మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు కృష్ణానగర్ నుంచి పోటీ చేసేందుకు టీఎంసీ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 04:19 PM