Share News

Lok Sabha elections: మహారాష్ట్రలో కుదిరిన కూటమి సీట్ల సర్దుబాటు

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:18 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన పార్టీకి 21 సీట్లు కేటాయించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో అభ్యర్థులను నిలపనుంది. అలాగే శరద్‌ పవర్ సారథ్యంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తోంది.

Lok Sabha elections: మహారాష్ట్రలో కుదిరిన కూటమి సీట్ల సర్దుబాటు

ముంబై, ఏప్రిల్ 09: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన పార్టీకి 21 సీట్లు కేటాయించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో అభ్యర్థులను నిలపనుంది. అలాగే శరద్‌ పవర్ సారథ్యంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తోంది.

సంగ్లీలో తిరిగి శివసేన (యూబీటీ) పోటీ చేస్తుంది. బీవండిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ.. తన పార్టీ అభ్యర్థిని నిలపుతోంది. అయితే ముంబై ఉత్తరం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొంది. ఇక లోక్ సభ సీట్ల ఒప్పందంపై ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ప్రతి ఒక్కరూ సీట్ల కోసం పోరాడాలని కోరుకుంటారు.

Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు


Lok Sabha Elections: తొలిసారి కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు..

తప్పు లేదు కానీ.. గెలుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలున్నా.. ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది. ఇక మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు 5 దశల్లో జరగనున్నాయి. అవి ఏప్రిల్ 19 నుంచి మే 20వ తేదీ వరకు జరుగుతాయి.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 09 , 2024 | 02:03 PM