Share News

Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:21 AM

ఓట్ల కోసం వచ్చే అన్నాడీఎంకే నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Movie actor Mansoor Ali Khan) పిలుపునిచ్చారు.

Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు

చెన్నై: ఓట్ల కోసం వచ్చే అన్నాడీఎంకే నేతల వద్ద ఓటర్లు మాట్లాడుకుని డబ్బులు తీసుకోవాలని సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Movie actor Mansoor Ali Khan) పిలుపునిచ్చారు. ఇండియా జననాయగ పులిగల్‌ పేరుతో పార్టీని స్థాపించిన ఆయన.. వేలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన నియోజకవర్గవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులకు అన్నాడీఎంకే నేతలతో సంప్రదింపులు జరిపి డబ్బులు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఆడియో ఒకటి విడుదలైంది. ఈ ఆడియో గుడియాత్తం, పేర్నాంపట్టు తదితర ప్రాంతాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో బాగా షేర్‌ అవుతోంది. ఈ అంశంపై ఎన్నికల సంఘం అధికారుల ఆదేశం మేరకు జిల్లా నిఘా విభాగం పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదికూడా చదవండి: BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

Updated Date - Apr 09 , 2024 | 11:21 AM