Share News

Lok Sabha Elections: కాంగ్రెస్‌తో సంజయ్ నిరుపమ్ కటీఫ్.. షిండే శివసేనలో చేరిక

ABN , Publish Date - May 03 , 2024 | 09:31 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో శుక్రవారంనాడు చేశారు. షిండే సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Lok Sabha Elections: కాంగ్రెస్‌తో సంజయ్ నిరుపమ్ కటీఫ్.. షిండే శివసేనలో చేరిక

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ (Sanjay nirupam) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని శివసేన (Shiv Sena)లో శుక్రవారంనాడు చేశారు. షిండే సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 20 ఏళ్ల తర్వత తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని ఈ సందర్భంగా సంజయ్ నిరుపమ్ తెలిపారు. శివసేన, ఏక్‌నాథ్ షిండే బలపడేందుకు తాము పనిచేస్తామని, పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా నిజాయితీగా పనిచేస్తానని చెప్పారు.

Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య


కూటమితో సీట్ల షేరింగ్‌పై అసంతృప్తి..

ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం విషయంలో పార్టీ అనుసరించిన వైఖరితో కొద్దికాలంగా సంజయ్ నిరుపమ్ అసంతృప్తితో ఉన్నారు. 'ఇండియా' కూటమితో ఒప్పందంలో భాగంగా ఆ సీటును శివసేన నేత అమోట్ కీర్తికర్‌కు అప్పగించడంతో ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఆయన పేరును కాంగ్రెస్ తొలగించింది. పార్టీ నిర్ణయాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంజయ్ నిరుపమ్ ఏఐసీసీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఆ లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. దీంతో కాంగ్రెస్ వేగంగా స్పందిస్తూ, ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆయన సైతం అదే వేగంతో తన భార్య, కుమార్తెతో కలిసి షిండే శివసేనలో శుక్రవారం చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 09:31 PM