Share News

Lok Sabha Polls 2024: రాజ్యాంగాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు.. లాలూ వార్నింగ్

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:17 PM

లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ''నూతన రాజ్యాంగ'' రూపకల్పన చేస్తామంటూ బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తున్నారని, వారిని మోదీ అదుపు చేయలేకపోతున్నారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరచేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రజలు వాళ్ల కళ్లను పెరికివేస్తారని ఆయన హెచ్చరించారు.

Lok Sabha Polls 2024: రాజ్యాంగాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు.. లాలూ వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ''నూతన రాజ్యాంగ'' రూపకల్పన చేస్తామంటూ బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తున్నారని, వారిని మోదీ అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని బలహీనపరచేందుకు ఎవరు ప్రయత్నించినా ప్రజలు వాళ్ల కళ్లను పెరికివేస్తారని లాలూ హెచ్చరించారు.


బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా శిక్షపడి, ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు తరచు రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇందువల్ల తలెత్తే పరిణామాలు తెలుసుకోకుండా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, వీరిలో కొందిరికి బీజేపీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని చెప్పారు.


లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించడమే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే లక్ష్యమంటూ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉంటేనే రాజ్యాంగాన్ని సవరించడం సాధ్యమవుతుందని చెబుతోంది. దీనిపై లాలూ ప్రసాద్ మాట్లాడుతూ, నిజానికి పీఎంకు భయం పట్టుకుందని, తన భయాలను దాచిపెట్టుకునేందుకే బీజేపీ 370కి పైగా సీట్లలో గెలుస్తుందంటూ అతిశయోక్తులతో ప్రచారం సాగిస్తున్నారని అన్నారు.

Lok Sabha polls 2024: సంఘవ్యతిరేకులతో రాహుల్ 'రహస్య ఒప్పందం'... మోదీ ఘాటు విమర్శ


రాజ్యాంగంలో మార్పులను లక్ష్యంగా చేసుకుని గతంలో పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేసారు. అయోధ్య సిట్టింగ్ ఎంపీ లాలూ సింగ్ ఇటీవలే ఈ తరహా ప్రకటన ఒకటి చేశారు. అయితే, నోరు జారానంటూ తన ప్రకటనను ఆయన వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ బీజేపీ అభ్యర్థి జ్యోతి మీర్దా, పార్టీ కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే సైతం గతంలో ఈ తరహా ప్రకటనలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 05:18 PM