Share News

Kharge: బ్రిటిషర్లలా దోచుకున్న మోదీ

ABN , Publish Date - May 25 , 2024 | 06:20 AM

బ్రిటిషర్ల తరహాలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ఈ దేశ సంపదైన నీరు, అడవులు, భూములను కొల్లగొట్టిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Kharge: బ్రిటిషర్లలా దోచుకున్న మోదీ

400కు పైగా సీట్లెలా వస్తాయి?: ఖర్గే

దేవ్‌గఢ్‌/కలబుర్గి, మే24: బ్రిటిషర్ల తరహాలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ఈ దేశ సంపదైన నీరు, అడవులు, భూములను కొల్లగొట్టిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. శుక్రవారం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

దేశ ఆస్తులను బిలియనీర్లయిన తన స్నేహితులకు మోదీ యథేచ్ఛగా దోచిపెట్టారని ధ్వజమెత్తారు. బ్రిటిష్‌ వారినే ఎదుర్కొన్నామని, బీజేపీకి భయపడేదిలేదన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడు హిందూ, ముస్లింలను ఏకం చేస్తుందని, కాషాయ పార్టీ మాత్రం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తోందని మండిపడ్డారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉద్వాసన పలకడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు బీజేపీ అన్నిచోట్లా ఓడిపోతుంటే 400కు పైగా సీట్లు గెలుస్తామనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎలా లేవనెత్తారోనని ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి మెజారిటీ రావడానికి అన్ని అవకాశాలున్నాయన్నారు.

Updated Date - May 25 , 2024 | 06:23 AM