BJP leadr dies: పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలో గుండెపోటుతో బీజేపీ నేత మృతి
ABN , Publish Date - Jun 17 , 2024 | 07:26 PM
కర్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ సోమవారంనాడు గుండెపోటుతో మరణించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శివమొగ్గలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కారులో ఆయనను ఎక్కిస్తుండగా కుప్పకూలిపోయారు.

శివమొగ్గ: కర్ణాటక బీజేపీ (BJP) నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ (MB Bhanu Prakash) సోమవారంనాడు గుండెపోటుతో మరణించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శివమొగ్గలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కారులో ఆయనను ఎక్కిస్తుండగా కుప్పకూలిపోయారు. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 69 ఏళ్ల భానుప్రకాష్ గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడుగా సేవలందించారు.
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది. పెంచిన ధరలపై బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది.
Train accident: రైలు ప్రమాదస్థలికి బైక్‌పై కేంద్ర మంత్రి.. రాజకీయాలకు సమయం కాదని స్పష్టీకరణ
పెంపును సమర్ధించుకున్న సీఎం
కాగా, పెట్రోల్, డీజిల్ ధరలపై సేల్స్ టాక్స్ పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు కర్ణాటకలో తక్కువేనని అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర నిధులు, జీఎస్‌టీ డివాల్యూయేషన్ వాటా, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలో అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
Also Read: Read Latest National News and Telugu States News