Share News

Punjab: కంగనాకు చెంపదెబ్బ: స్పందించిన సీఎం

ABN , Publish Date - Jun 10 , 2024 | 08:04 PM

టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు.

Punjab: కంగనాకు చెంపదెబ్బ: స్పందించిన సీఎం
Punjab Chief Minister Kangana Ranaut slap row: Punjab Chief Minister

పంజాబ్, జూన్ 10: టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు. పంబాజ్ రైతుల ఆందోళన సమయంలో నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడి ఘటన చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో సదరు మహిళా కానిస్టేబుల్ మనస్సు మండిందన్నారు. అయితే ఈ తరహా ఘటన చోటు చేసుకోకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?


ఇక ఈ ఘటన అనంతరం నటి కంగనా చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలో తీవ్రవాదమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్ అందించిన సహాకారాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే నేడు దేశానికి పంజాబ్ ఆహారాన్ని సైతం అందిస్తుందన్నారు. అలాంటి రాష్ట్రంపై.. ప్రతీ విషయంలో తీవ్రవాదులు, వేర్పాటువేదాలంటూ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన సమయంలో తీవ్రవాదులంటూ ఆరోపణలు చేశారని సీఎం మాన్ పేర్కొన్నారు.

Also Read: Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?


జూన్ 6వ తేదీన న్యూడిల్లీ వెళ్లేందుకు కంగనా రనౌత్.. ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమాన ప్రయాణికుల తనిఖీ చేస్తున్న ప్రదేశంలో ఆమె కూర్చుంది. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్.. కంగనా వద్దకు వచ్చి వాగ్వివాదానికి దిగింది. అందులోభాగంగా కంగనా చెంప ఛెళ్లుమనిపించింది. దాంతో అక్కడనున్న ఉన్నతాధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని.. సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

Also Read: Modi3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !


మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే కంగనా స్పందించింది. తాను బాగానే ఉన్నానని తెలిపింది. అయితే పంజాబ్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం పెరుగుతున్నట్లు తాను గుర్తించానని చెప్పింది. అనంతరం న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు వివరించింది. ఇక పంజాబ్ రైతులు న్యూఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో రూ.100, రూ.200 ఇచ్చి సదరు రైతులను ఈ ఆందోళనకు తీసుకు వస్తున్నారంటూ కంగనా వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Also Read: Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

ఇంకోవైపు తనపై జరిగిన దాడి పట్ల బాలీవుడ్ స్పందించ లేదు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కంగనా స్పందించింది. అనంతరం ఆ పోస్ట్‌ను సైతం.. తన ఇన్ స్టా నుంచి తొలగించింది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా కంగనా రనౌత్ విజయం సాధించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 08:05 PM