Share News

Loksabha Elections: జమ్మూకశ్మీర్‌లో ఆ రెండు పార్టీలతో పొత్తుకు బీజేపీ పావులు

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:35 PM

జమ్మూకశ్మీర్‌లోని 5 పార్లమెంటరీ స్థానాల్లో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోంది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ , జమ్మూ-కశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్టాప్ బుఖారితో చర్చలకు బీజేపీ రాష్ట్ర విభాగం ప్రయత్నాలు చేస్తోంది. సజ్జద్ లోన్, బుఖారితో చర్చలు జరిపేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్నారు.

Loksabha Elections: జమ్మూకశ్మీర్‌లో ఆ రెండు పార్టీలతో పొత్తుకు బీజేపీ పావులు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir లోని 5 పార్లమెంటరీ స్థానాల్లో పొత్తులకు బీజేపీ (BJP) పావులు కదుపుతోంది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోన్ (Sajjad Lone), జమ్మూ-కశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్టాప్ బుఖారి (Altaf Bukhari)తో చర్చలకు బీజేపీ రాష్ట్ర విభాగం ప్రయత్నాలు చేస్తోంది. సజ్జద్ లోన్, బుఖారితో చర్చలు జరిపేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.


కాగా, కశ్మీర్‌లో పోటీకి బీజేపీ దూరంగా ఉండాలని అనుకుంటోందని, శ్రీనగర్, బారాముల్లాలో అల్టాఫ్ బుఖారి, సజ్జద్ లోన్‌కు మద్దతు ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఆజాద్ ఇప్పటికే సంప్రదింపులు సాగిస్తునట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో మొదటి ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. మే 13న నాలుగో విడతలో శ్రీనగర్‌లోనూ, మే 20న ఐదో విడతలో బారాముల్లాలోనూ పోలింగ్ జరుగనుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు

Updated Date - Apr 06 , 2024 | 04:35 PM