Share News

Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:22 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 'ఇండియా' కూటమి నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తిరిగి ఈ ఎన్నికల్లో జత కట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశిత విమర్శలు గుప్పించారు.

Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు

లక్నో: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో 'ఇండియా' (I.N.D.IA.) కూటమి నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తిరిగి ఈ ఎన్నికల్లో జత కట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిశిత విమర్శలు గుప్పించారు. 2017లో ఇద్దరి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, అప్పటి 'ఫ్లాప్ ఫిల్మ్' మరోసారి రిలీజ్ అవుతోందని చమత్కరించారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, తమకు గట్టిపట్టున్న చోట్ల కూడా గ్రేండ్ ఓల్డ్ పార్టీకి (Congress) అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందన్నారు.


''నేను మొదటిసారి ఇలాంటి ఎన్నికలను చూస్తున్నాను. విపక్షాలు గెలుపు కోసం పోటీ చేయడం లేదు. కేవలం బీజేపీని 370 సీట్లు లోపు, ఎన్డీయేని 400 సీట్లు లోపు నిరోధించేందుకే పోటీ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ గంట గంటకు అభ్యర్థులు మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరో ఘోరంగా ఉంది. తమకు గట్టి పట్టున్న చోట్ల కూడా అభ్యర్థులు దొరకడం లేదు. ఇద్దరు కుర్రాలు (రాహుల్, అఖిలేష్) కలిసి చేసిన సినిమా గత పర్యాయం ఫ్లాప్ అయింది. అయినా మరోసారి తెరపైకి వస్తు్న్నారు'' అని మోదీ అన్నారు.

PM Modi: కుటుంబ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాం.. ప్రధాని మోదీ..


శక్తిని మనం ఆరాధిస్తాం..వారి పోరాటం శక్తిపైనే..

శక్తి మాతను మనం పూజిస్తామని, అయితే 'మా శక్తి'తోనే తమ పోరాటమని 'ఇండియా' కూటమి గట్టిగా చెబుతోందని ప్రధాన మంత్రి చరుకలు వేశారు. భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సాన్ని ఈ సందర్భంగా ఆయనను ప్రస్తావిస్తూ, కొద్ది దశాబ్దాల్లోనే దేశ జనాభాల్లో రికార్డు స్థాయిలో ప్రజలు బీజేపీలో చేరారని, ప్రజావిశ్వాసాన్ని పార్టీ పొందగలిగిందని, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుందని అన్నారు. రాజకీయాలను కాకుండా, జాతీయ విధానాన్ని బీజేపీ నమ్ముకోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. 'నేషన్ ఫస్ట్' అనే నినాదంతో బీజేపీ సేవలందిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్షకు తావులేని పాలన అందిస్తోందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ బిల్లు తెచ్చామని, 370వ అధికరణను రద్దు చేస్తామని చెప్పినట్టే చేసి చూపించామని, వికసిత్ జమ్మూకశ్మీర్‌ నిర్మాణం మొదలైందని చెప్పారు. పదేళ్లలో ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూలలకు కూడా అందేలా చేశామన్నారు. కేంద్ర పథకాలతో 100 శాతం ప్రజలు ప్రయోజనం పొందినప్పుడే అది నిజమైన సెక్యులరిజం, నిజమైన సామాజిక న్యాయం అవుతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ నియోజకవర్గంతో పాటు ఏడు లోక్‌సభ స్థానాల్లో మొదటి దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 03:22 PM