Share News

Congress: పతానావస్థకు భారత ఆర్థిక వ్యవస్థ.. బీజేపీపై వ్యంగ్యస్త్రాలు సంధించిన చిదంబరం

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:57 PM

భారత ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరుకుందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్(Congress) నేత పి.చిదంబరం(P.Chidambaram) ఆరోపించారు. బీజేపీ వైద్యులు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చికిత్స చేయట్లేదని విమర్శించారు.

Congress: పతానావస్థకు భారత ఆర్థిక వ్యవస్థ.. బీజేపీపై వ్యంగ్యస్త్రాలు సంధించిన చిదంబరం

ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరుకుందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్(Congress) నేత పి.చిదంబరం(P.Chidambaram) ఆరోపించారు. బీజేపీ వైద్యులు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చికిత్స చేయట్లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. దేశంలో నానాటికీ నిరుద్యోగం పెరిగిపోతోందని.. ద్రవ్యోల్బణం కట్టడికి బీజేపీ చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు.

"2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) ప్రవాహాలు 31 శాతం ఎందుకు తగ్గుముఖం పట్టాయో వివరణ ఇవ్వట్లేదు. బీజేపీ ప్రభుత్వ విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి ఈ ప్రక్రియే కొలమానం. బీజేపీ తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటుంది. ఆ సర్టిఫికెట్ విదేశీ, భారతీయ పెట్టుబడిదారులు ఇవ్వాలి’ అని ఆయన అన్నారు.


అధిక వడ్డీ రేట్లు, నిరుద్యోగం..

గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై భారతీయ పెట్టుబడిదారులు విశ్వాసంగా లేరని చిదంబరం విమర్శించారు అందుకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెట్టుబడులను పెంచమని వేడుకోవలసి వచ్చిందని అన్నారు. “వడ్డీ రేట్లు పెరిగాయి. వేతనాలు నిలిచిపోయాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది.

ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కచ్చితమైన సంకేతాలు. కానీ బీజేపీ వైద్యులకు ఇవి అర్థం కాకపోవడంతో వాటిని పట్టించుకోవడం లేదు”అని చిదంబరం విమర్శించారు. విదేశీ పెట్టుబడిదారులు బీజేపీ తప్పుడు విధానాలను, భారత ఆర్థిక వ్యవస్థ పతానావస్థను గ్రహించారని చిదంబరం అన్నారు. అందుకే వారు భారత్ నుంచి డబ్బు తీసుకుంటున్నా దేశంలోకి పెట్టుబడులను తీసుకురావడం లేదని విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 05:01 PM