Share News

IAF: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో రికార్డ్.. నైట్ విజన్ గాగుల్స్‌తో విమానం ల్యాండింగ్ సక్సెస్

ABN , Publish Date - May 23 , 2024 | 03:34 PM

ఈస్టర్న్ సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్‌లో నైట్ విజన్ గాగుల్స్ (NVG)ని ఉపయోగించి C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరో మైలురాయిని సాధించింది. ఈ విజయాన్ని ఐఏఎఫ్ ఎక్స్‌లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి రెండు వీడియోలను షేర్ చేసింది.

IAF: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో రికార్డ్.. నైట్ విజన్ గాగుల్స్‌తో విమానం ల్యాండింగ్ సక్సెస్

ఢిల్లీ: ఈస్టర్న్ సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్‌లో నైట్ విజన్ గాగుల్స్ (NVG)ని ఉపయోగించి C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరో మైలురాయిని సాధించింది. ఈ విజయాన్ని ఐఏఎఫ్ ఎక్స్‌లో ప్రకటించింది.

ఇందుకు సంబంధించి రెండు వీడియోలను షేర్ చేసింది. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇండక్షన్‌తో భారత వైమానిక దళ సామర్థ్యాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ విమానాలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ల సరఫరాలో, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో కీలకంగా వ్యవహరించాయి.


C-130J అనేది రెండు పైలట్ ఫ్లైట్ స్టేషన్, షార్ట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ (STOL) సామర్థ్యాలను కలిగి ఉన్న అత్యాధునిక విమానం. ఇది నైట్ విజన్ గాగుల్స్ (NVG), ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ ఇమేజరీని ఉపయోగించి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని, పగలు రాత్రి కార్యకలాపాలకు వీలు కల్పిస్తూ పూర్తిగా సమీకృత డిజిటల్ ఏవియానిక్స్‌తో అమర్చి ఉంటుంది.

వీటితోపాటు విమానంలో కలర్ మల్టీఫంక్షనల్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేలు, హెడ్-అప్ డిస్‌ప్లేలు (HUD) అధునాతన నావిగేషన్ సిస్టమ్‌లు, డ్యూయల్ ఇనర్షియల్ నావిగేషన్, GPSలు ఉన్నాయి.
For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 03:52 PM