Share News

Farmer: చదివింది 8వ తరగతి.. ఆదాయం రూ. 1.5 కోట్లు.. దటీజ్ రైతన్న..

ABN , Publish Date - Jan 25 , 2024 | 06:55 PM

Farmer: అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..

Farmer: చదివింది 8వ తరగతి.. ఆదాయం రూ. 1.5 కోట్లు.. దటీజ్ రైతన్న..
Farming Tips

గాంధీనగర్, జనవరి 25: 'కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు' అన్నట్లుగా చేయాలనే సంకల్పం ఉండాలే గానీ.. చదువు, స్కిల్స్‌తో పని లేదు. జీవితంలో ఇట్టే సెటిల్ అవ్వొచ్చు. ఇవి వట్టి మాటలు కావండోయ్.. ఈ రైతు చూసి మీరు కూడా అదే డిసైడ్ అవుతారు. అవును, అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..

రూ. 1.5 కోట్ల ఆదాయం..

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా అమ్రాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియా అనే రైతు తన వృత్తిలో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. తనకున్న 38 బిగాల భూమిలో మిర్చి సాగు చేసి.. గణనీయమైన దిగుబడిని పొందాడు. తన ఉత్పత్తులను నైపుణ్యంగా ఉపయోగించుకుంటూ.. మిరప పొడిని ప్రాసెస్ చేస్తూ సంపాదిస్తున్నారు. దీనిని ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయడం ద్వారా ఏడాదికి రూ. 1.50 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మొత్తంగా రూ. 90 లక్షలకు పైగా వార్షిక ఆదాయం పొందుతున్నట్లు తెలిపాడు ధర్మేష్. తనకున్న 38 బిగాల భూమిలో ప్రతి సంవత్సరం 60 టన్నుల మిర్చి దిగుబడి వస్తుందని చెప్పాడు. ధర్మేష్ ప్రకారం.. రిటైల్ మార్కెట్‌లో నాణ్యమైన మిర్చి కిలో రూ. 500 నుంచి రూ. 600 వరకు ఉంది. ఇక ధర్మేష్ హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలోకు రూ. 250 చోప్పున విక్రయిస్తే.. 60 టన్నుల మిర్చి పంటకు సుమారు రూ. 1.5 కోట్ల ఆదాయం వస్తుంది.

సరికొత్త పద్ధతులు..

కాగా, అమ్రేలి జిల్లా పరిధిలోని కుంకవావ్ తాలూకాలోని అమ్రాపూర్ గ్రామంలో ఎక్కువ మంది రైతులు మిర్చి సాగు ఎక్కువగా చేస్తారు. మిర్చి ఉత్పత్తిని పెంచడానికి రైతులు అనేక పద్ధతులను పాటిస్తారు. ఫలితంగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఈ విజయ గాధలలో ధర్మేష్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. అతని సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు స్థానికంగా గుర్తింపు పొందడమే కాకుండా.. పొరుగు గ్రామాల రైతులను కూడా ఎంతగానో ఆకర్షించాయి.

చదివింది 8వ తరగతి..

కేవలం ఎనిమిదో తరగతి చదివిన 45 ఏళ్ల రైతు ధర్మేష్ భాయ్ మాతుకియా.. గత ఐదేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నాడు. కాశ్మీరీ డబ్బి వంటి రకాలను సాగు చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ధర్మేష్ 38 బిగాల భూమిలో మిర్చి సాగు చేశాడు. మొత్తం 60 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, ధర్మేష్ తన పంటను మార్కెట్‌లో నేరుగా విక్రయించకుండా.. వాటిని ఫౌడర్‌గా ప్రాసెస్ చేస్తాడు. తానే స్వయంగా ఆ కారం పొడిని విక్రయిస్తాడు. కాశ్మీరీ మిర్చి ఫౌడర్ కిలో రూ. 450 పలుకుతుండగా.. కాశ్మీరీ మిక్స్ కిలో రూ. 350 ఉంది. ఈ ఏడాది 50 టన్నుల కారం పొడిని ఉత్పత్తి చేయాలిని టార్గెట్ పెట్టుకున్నట్లు ధర్మేష్ తెలిపాడు. ఇక తాను తయారు చేసిన ఈ కారం పొడిని ధర్మేష్ అమెరికా సహా పలు దేశాలకు ఎగుమతులు చేస్తున్నాడు. ఇలా వార్షిక ఉత్పత్తితో రూ. 1.50 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇందులో వ్యవసాయ కూలీ వంటి ఖర్చులు పోగా.. రూ. 90 లక్షలకు పైగా ఆదాయం అతనికి మిగులుతుంది.

Updated Date - Jan 25 , 2024 | 07:08 PM