Share News

Rajya Sabha Elections: జేపీ నడ్డా సహా నలుగురు బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:03 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభ రేసులో ఉన్న గోవింద్ ధోలకియా, డాక్టర్ జస్వంత్‌సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మార్, మయాంక్ నాయక్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Rajya Sabha Elections: జేపీ నడ్డా సహా నలుగురు బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) గుజరాత్ (Gujarat) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభ రేసులో ఉన్న గోవింద్ ధోలకియా, డాక్టర్ జస్వంత్‌సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మార్, మయాంక్ నాయక్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


నడ్డాతో సహా గెలుచిన నలుగురు బీజేపీ అభ్యర్థులల్లో ధోలకియా అత్యంత సంపన్నుడు. వజ్రాల వ్యాపారి అయిన ధోలకియా తన ఆస్తి విలువ రూ.279 కోట్లుగా డిక్లేర్ చేశారు. జేపీ నడ్డా రూ.9.36 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ అభ్యర్థులు ఎవరిపైనా ఎఫ్ఐఆర్‌లు కానీ, క్రిమినల్ విచారణలకు కానీ లేవని అఫిడవిట్‌లో డిక్లేర్ చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 06:03 PM