Share News

Gold and Silver: ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో భారీగా బంగారం, వెండి పట్టివేత

ABN , Publish Date - Jan 29 , 2024 | 09:29 AM

ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో భారీగా బంగారంతో పాటు వెండిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 11 కోట్ల విలువ చేసే 16.67 కేజీల బంగారంతో పాటు 39.73 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు.

Gold and Silver: ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో భారీగా బంగారం, వెండి పట్టివేత

ఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో భారీగా బంగారంతో పాటు వెండిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 11 కోట్ల విలువ చేసే 16.67 కేజీల బంగారంతో పాటు 39.73 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ పార్శిల్‌లో బంగారం, వెండిని గుర్తించారు. ఎలక్ట్రిక్ మీటర్లలో బంగారంతో పాటు వెండి దాచి ఢిల్లీకి కేటుగాళ్లు పార్శిల్ పంపించారు.

అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలక్ట్రిక్ మీటర్ల పై భాగంలో బంగారంతో పాటు వెండి కోటింగ్ చేసి పైన నల్లటి పెయింట్‌ను స్మగ్లర్స్ రుద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ ఫోస్ట్ ఆఫీసులో డీఆర్ఐ మాటు వేసింది. విదేశాల నుంచి వచ్చిన పార్శిల్‌పై అధికారులు నిఘా పెట్టారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌లో బంగారం గుట్టును డీఆర్ఐ అధికారులు రట్టు చేశారు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్శిల్‌పై ఉన్న అడ్రస్ ప్రకారం స్మగ్లర్స్ వేటలో డీఆర్ఐ అధికారులు పడ్డారు.

Updated Date - Jan 29 , 2024 | 10:05 AM